
న్యూఢిల్లీ: కంపెనీ బోర్డులో సౌది ఆరామ్‌కో చైర్మన్ యాసిర్ ఓత్మన్ హెచ్ ఆల్ రుమాయన్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తిరిగి నియమించేందుకు 83.97 శాతం మంది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు.
16 శాతం మంది షేర్ హోల్డర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. రుమాయన్ మరో ఐదేళ్ల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఆయనతో పాటు ఖైతాన్ అండ్ కో పార్టనర్ హైగ్రెవె ఖైతాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా, పీఎంఎస్ ప్రసాద్ డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి తిరిగి నియమితులయ్యారు.
ఆల్ రుమాయన్ ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ ఫండ్ అయిన సౌది అరేబియా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2021 లో మొదటిసారిగా మూడేళ్లకు గాను రిలయన్స్ బోర్డులో చేరగా, వచ్చే నెల 18 తో రుమాయన్ పదవీ కాలం ముగుస్తుంది.