బైక్ ఆపలేదని లాఠీ విసిరిండు

 బైక్ ఆపలేదని లాఠీ విసిరిండు

హైదరాబాద్లో పోలీసుల ఓవర్ యాక్షన్ మరోసారి బయటపడింది. మార్చి 15న నగరంలోని నాగోల్, చైతన్యపురి రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కేధారినాథ్ అనే యువకుడు బైక్ ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో తనిఖీ చేస్తున్న ఎస్ఐ అతనిపైకి ఫైబర్ లాఠీ విసిరాడు. అది అతని తలకుగట్టిగా తగలడంతో కేధారినాథ్  అదుపు తప్పి బైక్ నుంచి కిందపడిపోయాడు. 

ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కేధరినాథ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్ ఆపకుంటే పోలీసులు ఇలా దాడి చేస్తారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.