జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలె

జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలె
  • జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలె
  • చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని 


జనగామ జిల్లా:  చాకలి ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా, ఆదుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి.  శనివారం జనగామలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలన్నారు. జనగామ జిల్లాకు ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని.. జిల్లా కేంద్రంలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పాలకుర్తి అసెంబ్లీ సీటును అన్ని పార్టీలు రజకులకే కేటాయించాలన్న ఆయన..  రాష్ట్రంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.