ఉపరాష్ట్రపతిగా రాజీనామా తర్వాత..తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగదీప్ధంఖర్. భోపాల్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కనిపించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ధంఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమానం ఎక్కడం కంటే తన విధులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటూ ఆకట్టుకునే కామెంట్స్ చేశారు. వ్యక్తిగత, రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు అతని నిబద్దతను హైలైట్ చేశాయి.
శుక్రవారం (నవంబర్22) మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో హమ్ ఔర్ యా విశ్వ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు ధంఖర్. ఆనారోగ్యకారణాలను చూపుతూ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేయడం చుట్టూ ఉన్న ఊహాగానాలుఉన్నప్పటికీ అయినా దానిపై స్పందించనని ధంఖర్ స్పష్టం చేశారు. సవాళ్ల సుడిగుండంలో చిక్కుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై ధంఖర్ తనదైన శైలీలో హెచ్చరించారు. అది చక్రవ్యూహం అని తప్పించుకోవడం సాధ్యం కాదు అని అన్నారు.
జగదీప్ ధంఖర్ ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేశారు. దంఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. రాజీనామా తర్వాత ధంఖర్ ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. ఆయన లేఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ,ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో భారతదేశ ఆర్థిక వృద్ధి పట్ల తనకు గర్వం ఉందని నొక్కి చెప్పడం చర్చకుదారితీసింది.
ధంఖర్ రాజనీమా వెనక రాజకీయ కుట్ర?
జగదీప్ దంఖర్ ప్రతిపక్షాలకు సపోర్టు చేస్తున్నాడు.. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు విరుద్దంగా ప్రతిపక్షాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆమోదించారు.. ఆ తర్వాత ఒత్తిడి కారణంగానే ధంఖర్ రాజీనామా చేశారని విమర్శలు వచ్చాయి. ఇది ఎన్డీయే కూటమిలో అంతర్గత ఉద్రిక్తతలకు దారి తీసింది. అధికారికంగా ధంఖర్ అనారోగ్యం కారణంగా రాజీనామా చేశారని చెబుతున్నప్పటికీ లోతైన రాజకీయ విభేదాలు ఉన్నాయని కొనసాగుతున్నాయి. రాజకీయంగా అనేక చిక్కులను ఎదుర్కొంటూనే విధి పట్ల దృఢమైన నిబద్ధత, ప్రాముఖ్యతను ఆయన అంతర్లీన వ్యాఖ్యలు నొక్కి చెబుతున్నాయి.
