ఒక్క పెయింటింగ్​లో 40 యాడ్స్​

ఒక్క పెయింటింగ్​లో 40 యాడ్స్​

కొండ మీద నుంచి దూకుతున్న జలపాతం. ఆ కొండల మధ్య పారుతున్న ఏరు. దాని పక్కనే ఇళ్లు. సరదాగా ఆటపాటలతో గడుపుతున్న జనం, పిల్లలు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ. చూడగానే పెయింటింగ్​ బాగుందే అనిపించేలా ఉంది కదూ. కానీ, ఇక్కడే మీకో చాలెంజ్​. ఏంటా చాలెంజ్​.. కమాన్​ అడగండి చెప్పేస్తాం అంటారా? ఈ పెయింటింగ్​ 40 అడ్వర్టైజ్​మెంట్లు (ప్రకటనలు) ఉన్నాయి. కనిపెట్టగలరా? ఓసోస్​.. ఇంతేనా, అదెంతపని కనిపెట్టేస్తాం చూడండి అని సవాల్​కు సిద్ధమవుతున్నారా. అది కనిపెట్టాలంటే ఆ పెయింటింగ్​ను పట్టిపట్టి చూడాలి. ఇంకోటి అందులో చాలా చాలా పాత ప్రకటనలూ ఉన్నాయి. కాబట్టి కనిపెట్టడం దాదాపు కష్టమే. ఈ పెయింటింగ్​ను వైభవ్​ విశాల్​ అనే వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. దీంతో అది వైరల్​ అయింది. ‘‘ఈ పెయింటింగ్​లో 40 ప్రకటనలున్నాయి. పాత క్లాసిక్స్​ కూడా. అలాంటి పాతదనాన్ని ఇష్టపడే వారి కోసం ఈ సవాల్​. ఆ యాడ్​లో ఏంటో కనిపెట్టండి. సవాల్​లో గెలిచినోళ్లకు జిలేబీలు ఇస్తా” అంటూ ట్వీట్ చేశారు. దీంతో కొద్ది సేపట్లోనే ఆ పెయింటింగ్​ ట్వీట్​ వైరల్​ అయింది.

ఆ యాడ్​లు ఇవే

  1. హ్యాపీ డెంట్​యాడ్​, 2. ఏషియన్​ పెయింట్స్​, 3. వొడాఫోన్​ జూజూలు, 4. మారుతి, 5, విక్స్​(ఓల్డ్​), 6. కాడ్బరీ బోర్న్​వీటా (ఓల్డ్​), 7. సర్ఫ్​ఎక్సెల్​ (పాతది), 8.ఈసీఈ బల్బులు, 9.ఫెవికాల్​ గుడ్డు, 10. కోల్గేట్​, 11.ధారా జిలేబి (ఆయిల్​), 12. హమారా బజాజ్​, 13.కాడ్బరీ డైరీమిల్క్​ (ఓల్డ్​), 14.పామోలివ్​ (కపిల్​దేవ్​ ఫస్ట్​ యాడ్​), 15.జిల్లెట్​, 16. విస్పర్​(ఓల్డ్​), 17. కోకాకోలా, 18.లిరిల్​, 19. వీఐపీ ఫ్రెంచీ, 20.ఎంఆర్​ఎఫ్​, 21.హచ్​, 22.ఫెవిక్విక్​, 23.లైఫ్​బాయ్​, 24.నైకీ, 25.తాజ్​మహల్​టీ, 26.నిర్మా, 27. లిజ్జత్​ పాపడ్​, 28.ఒనిడా, 29.సర్ఫ్​ఎక్సెల్​, 30.ఐడియా, 31.ఎయిర్​టెల్​, 32.బ్రిటానియా, 33.పెప్సి (షారూక్​), 34. కాడ్బరీ ఫైవ్​స్టార్​, 35.పెప్సీ (ధోనీ హెలికాప్టర్​ షాట్​), 36.గూగుల్​,
    37.ఏరియల్​, 38.బల్బీర్​పాషా, 39.అమూల్​, 40.మధ్యప్రదేశ్​ టూరిజం, 41.మ్యాగీ, 42.రస్నా, 43.సెంటర్​షాక్