అమరుల ఆత్మశాంతి కోసం సామూహిక పితృయజ్ఞం

అమరుల ఆత్మశాంతి కోసం సామూహిక పితృయజ్ఞం
  • మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ 

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా భైరాన్ పల్లి అమరదినం పాటించాలని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ప్రజలను కోరారు. అదే రోజు చలో భైరాన్ పల్లి నిర్వహిస్తున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని భైరాన్ పల్లి బురుజు వద్ద 118 మంది అమరుల ఆత్మశాంతి కోసం సామూహిక పితృయజ్ఞం చేస్తున్నట్టు వెల్లడించారు. 

ఉదయం 11.30 గంటలకు శ్రద్ధాంజలి కార్యక్రమం ఉంటుందని, కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి ముఖ్య​అతిథిగా హాజరవుతారని  చెప్పారు. తెలంగాణ పోరాటంలో భైరాన్ పల్లి యుద్ధతంత్రం, బలిదానంపై కసిరెడ్డి వెంకట్​రెడ్డి సందేశం ఇస్తారని తెలిపారు. 1948 ఆగస్టు 27న భైరాన్​ పల్లిలో 118 మంది పోరాటయోధులను  రజాకార్ మూకలు హతమార్చాయని గుర్తుచేశారు.