
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ పై దృష్టి పెట్టి ప్రక్షాళనకు కసరత్తులు చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే చైర్మన్ తో సహా సభ్యులను ప్రభుత్వం రాజీనామా చేయించిందని చెప్పారు.
అయితే, ఈ రిజైన్లపై గవర్నర్ తమిళిసై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. రాజీనామాల ఆమోదంలో న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని గవర్నర్ కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారని వివరించారు. రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుందని స్పష్టం చేశారు.