ఏం చేయాలో తెలియక మామ కరోనాకు బలయ్యాడు

ఏం చేయాలో తెలియక మామ కరోనాకు బలయ్యాడు

ఏం చేయాలో మాకెవరు చెప్పలే

స్యూఢిల్లీ: ‘కరోనా పెద్ద రోగమేం కాదు. జస్ట్‌‌‌‌ సర్ది లాంటిదే’ అని కొందరు అంటున్నరు. ‘వైరస్‌‌‌‌ సోకినా భయమొద్దు. లక్షల బెడ్లు, వందల హాస్పిటళ్లు సిద్ధం చేసినం. ఎంత మందొచ్చినా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ జరుగుతది’ అని కేంద్రం, రాష్ట్రాలు చెబుతున్నయి. కానీ ఓ ఎయిర్‌‌‌‌ వెటరన్‌‌‌‌ మాత్రం.. కరోనాను లైట్‌‌‌‌ తీసుకునేటోళ్లంతా ఫూల్స్‌‌‌‌ అంటున్నడు. ప్రభుత్వాలు చెబుతున్నదానికి, గ్రౌండ్‌‌‌‌ రియాలిటీకి పొంతన లేదని చెబుతున్నడు. కరోనా గురించి సరిగా తెలియక.. లక్షణాలుంటే ఎట్ల, ఎవరిని అప్రోచ్‌‌‌‌ అవాలో అర్థం కాక.. గ్రౌండ్‌‌‌‌ లెవెల్‌‌‌‌లో ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఎట్లుంటదో గమనించక తన మామయ్యను (64 ఏండ్లు) పోగొట్టుకున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మామయ్యకు జ్వరం స్టార్టయినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగిన సంఘటనలను వివరిస్తూ సోషల్‌‌‌‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ పోస్టు అంతా ఆయన మాటల్లో..

చిన్న జ్వరంగా స్టార్టయి వారంలో..

మే 11, 12 తేదీల్లో మామయ్యకు జ్వరం వచ్చింది. నార్మల్‌‌‌‌ ఫీవరే. కానీ రెండ్రోజుల్లో జ్వరం 100కు పెరిగింది. చిన్నగా గొంతు నొప్పి మొదలైంది. మేం భయపడ్డాం. తర్వాత రెండ్రోజులకు జ్వరం 101 దాటింది. గొంతు నొప్పి అలాగే ఉంది. ఇంకో రెండ్రోజులైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కరోనా టెస్టు చేయించాలని నిర్ణయించుకున్నాం. కానీ100కు పైగా జ్వరం 5 రోజులకు మించి ఉంటేనే టెస్టు చేయించాలని కొందరు చెప్పారు. మామయ్య కూడా మే 18 వరకు వెయిట్‌‌‌‌ చేద్దామని చెప్పేసరికి ఆగిపోయాం. అప్పటికీ జ్వరం తగ్గలేదు. తను ఢిల్లీలో, మేము చండీగఢ్‌‌‌‌లో ఉండటంతో ఇంటికెళ్లి శాంపిల్స్‌‌‌‌ తీసుకునే ఫెసిలిటీ ఉందేమోనని ట్రై చేశాం. పెద్ద ల్యాబ్స్‌‌‌‌గా పేరున్న లాల్‌‌‌‌/ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌ లాంటి వాటినీ అడిగాం. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే ఆరోగ్యసేతు యాప్‌‌‌‌ గురించి విన్నాం. తిలక్‌‌‌‌ నగర్‌‌‌‌లోని సిటీ ఎక్స్‌‌‌‌రే, స్కాన్‌‌‌‌ గురించి యాప్‌‌‌‌లో తెలుసుకున్నాం. వాళ్లు ఇంటికి వచ్చి టెస్టులు చేస్తామన్నారు.

ఫస్ట్‌‌‌‌ నెగెటివ్‌‌‌‌.. తర్వాత పాజిటివ్‌‌‌‌

సిటీ ఎక్స్‌‌‌‌రే, స్కాన్‌‌‌‌ సిబ్బంది 18, 19 తేదీల్లో ఇంటికొచ్చి శాంపిల్స్‌‌‌‌ తీసుకొని టెస్ట్‌‌‌‌ చేశారు. మామయ్యకు నెగెటివ్‌‌‌‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నాం. నెగెటివ్‌‌‌‌ వచ్చినా ఆయనకు ఫీవర్‌‌‌‌ తగ్గలేదు. దీంతో 20న ఓ డాక్టర్‌‌‌‌ను అప్రోచ్‌‌‌‌ అయ్యాం. అతను వేరే టెస్టులు కూడా చేద్దామన్నారు. ఆ రోజు రాత్రి మామయ్యకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. 21న పరిస్థితి మారకపోవడంతో ఇంట్లో ఉన్న మామయ్యను హాస్పిటల్‌‌‌‌కు షిప్ట్‌‌‌‌ చేయాలని డాక్టర్‌‌‌‌ చెప్పారు. మా దగ్గర నెగెటివ్‌‌‌‌ వచ్చిన రిపోర్టు ఉండటంతో చేర్చుకొని ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. అప్పటికే మామయ్య షుగర్‌‌‌‌ లెవల్స్‌‌‌‌ పెరిగిపోయాయి. 22న మామయ్యను వెంటిలేటర్‌‌‌‌పై పెట్టారు. టెస్టులో పాజిటివ్‌‌‌‌ వచ్చింది. దీంతో కొవిడ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు షిప్ట్‌‌‌‌ చేయాలని, హాస్పిటల్‌‌‌‌ను వెతుక్కోమని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్‌‌‌‌ ఉన్న అంబులెన్స్‌‌‌‌ ఒక్కటీ దొరకలేదు. 22వ తేదీ రాత్రి 9.45 అవుతోంది. మామయ్య పరిస్థితి ఎలా ఉందో చూద్దామని ఐసీయూకు వెళ్లాం. వెళ్లేసరికి ఆయన చనిపోయారు.

ఇట్ల చేస్తే బాగుంటది కదా

ఫాల్స్‌‌‌‌ నెగెటివ్‌‌‌‌ రిపోర్టిచ్చిన ల్యాబ్స్‌‌‌‌ను డీ లిస్ట్‌‌‌‌ చేయాలి. కరోనా ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ గురించి ఎవరికీ పెద్దగా సమాచారం లేదు. ప్రస్తుతం ఎన్ని వెంటిలేటర్లు, బెడ్లు అందుబాటులో ఉన్నాయో చెప్పే పోర్టల్‌‌‌‌ అందుబాటులో లేదు. అన్ని హాస్పిటళ్లను ఇంటిగ్రేట్‌‌‌‌ చేసి బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు చెప్పే ఓ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ తయారు చేస్తే బాగుంటుంది. పాజిటివ్‌‌‌‌ ఉంటేనే పేషెంట్లను కొవిడ్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌ చేర్చుకుంటున్నాయి. టెస్టులేమో కొన్ని ల్యాబ్‌‌‌‌లలోనే చేస్తున్నారు. ఎప్పుడు హాస్పిటల్‌‌‌‌కు పోయి టెస్టులు చేయించుకోవాలో ఎవరికీ తెలియదు. కొన్ని నాన్‌‌‌‌ కొవిడ్‌‌‌‌ హాస్పిటళ్లయితే కరోనా లక్షణాలుంటే పేషెంట్లను జాయిన్‌‌‌‌ చేసుకోవట్లేదు. ఎలాంటి టైమ్‌‌‌‌లో ఏం చేయాలో జనానికి ఇంకా అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ లేదు. కరోనాపై పబ్లిక్‌‌‌‌ బులెటిన్స్‌‌‌‌, పెద్ద యాడ్స్‌‌‌‌ ఎందుకు ఇవ్వడం లేదు.

For More News..

లాక్‌డౌన్‌పై ఈ రోజు నిర్ణయం?

డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మోస్ట్ డేంజర్