ముంబై సిటీ చాలా రోజుల తర్వాత ఎన్ కౌంటర్ తో దద్ధరిల్లింది. 17 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన రోహిత్య ఆర్యా అనే వ్యక్తిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం సిటీలో సంచలనంగా మారింది. చిన్నారులను కిడ్నాప్ చేసి బంధించి.. టెన్షన్ కు గురిచేసిన సైకో నుంచి పిల్లలను కాపాడే క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో.. తీవ్రంగా గాయపడిన రోహిత్య ఆర్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఎవరీ రోహిత్ ఆర్య..? ఎందుకు పిల్లలను కిడ్నాప్ చేశాడు.. ఎందుకు పోలీసులు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చింది..?
రోహిత్ ఆర్య నాగ్ పూర్ కు చెందిన వ్యక్తి. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలోని చెంబూర్ లో ఉంటున్నాడు. అయితే పిల్లల కిడ్నాప్ కు సంబంధించి వీడియో రిలీజ్ చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ్ భారత్ నినాదాల ప్రేరణతో.. పరిసరాల పారిశుధ్యంపై ఖర్చు చేసినట్లుగా చెప్పాడు. స్కూల్ పారిశుధ్యంపై ఖర్చు చేశాడు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి రీయింబర్స్మెంట్ వస్తుందని ఊహించాడు. ఈ విషయంలో తను ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని వీడియోలో చెప్పాడు.
అందుకే పిల్లలను కిడ్నాప్ చేసినట్లు వీడియోలో పేర్కొన్నాడు. తన డబ్బులు వచ్చే వరకు పిల్లలను బంధించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు వీడియో మెస్సేజ్ పంపాడు. తను కొందరితో మాట్లాడాలని.. ఆ వకాశం కల్పించాలని డిమాండ్ చేశాడు. అయితే రోహిత్ మెంటల్ కండిషన్ బాగాలేని వ్యక్తి అని.. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నేను టెర్రరిస్టును కాదు.. నన్ను షూట్ చేసి తప్పు చేయకండి.. నేను పిల్లలను బంధిస్తున్నాను.. సూసైడ్ చేసుకునే బదులు కొందరితో మాట్లాడాలి.. నావి సింపు డిమాండ్స్.. న్యాయమైన డిమాండ్స్.. కొన్ని ప్రశ్నలు.. అంటూ వీడియో ద్వారా హెచ్చరించాడు.
పొవై లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న RA స్టూడియో కు వచ్చిన పిల్లలుగా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి ఎయిర్ గన్ లాంటి వస్తువు, కొన్ని కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
