ముంబై ఎన్ కౌంటర్ ఘటన వెనుక మరో విషాధ కోణం వెలుగులోకి వచ్చింది. గురువారం (అక్టోబర్ 30) 17 మంది పిల్లలను బంధించి.. చివరికి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన రోహిత్ ఆర్య వెనుక ఒక విషాధ గాథ ఉన్నట్లు తెలస్తోంది. ఒక స్కూల్ టీచర్ అయిన రోహిత్.. కిడ్నాప్ చేసేంతగా తెగించడం వెనుక బలమైన కారణం ఉందని అతను పంపిన వీడియో మెసేజ్ ద్వారా అర్ధమవుతోంది.
రోహిత్ ఆర్య ఒక స్కూల్ టీచర్. ఎన్నో ఆదర్శాలు.. ఏదో చేయాలనే తపన. కానీ చివరిక ఒక కిడ్నాపర్ గా మిగిలిపోయాడు. కారణం.. ప్రభుత్వంపై అతడు పెంచుకున్న కోపం. పిల్లలను బంధించిన తర్వాత పంపిన వీడియో మెసేజ్ లో అదే చెప్పాడు. తను కొందరితో మాట్లాడాలని.. అందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. తను టెర్రరిస్టును కాదు.. ఎన్ కౌంటర్, షూటింగ్ లాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పాడు.
తనకు న్యాయం జరగాలంటే ఇదే మార్గమని భావించి ఈ పని చేశానని వీడియోలో చెప్పాడు. ఒకవేళ తనను చంపాలని చూస్తే పిల్లలను చంపేసి తనూ చనిపోతానని హెచ్చరించాడు. పొవాయ్ లోని RA స్టూడియోలో పిల్లలను బంధించిన రోహిత్.. పోలీసులు కాల్పులు వంటి తప్పు చేసి పిల్లల ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని హెచ్చరించాడు. తన న్యాయమైన కోరిక.. కొందరితో మాట్లాడాలి.. అందుకు ఏర్పాటు చేయండి.. అంటూ వీడియో మెసేజ్ చేశాడు.
►ALSO READ | ముంబై హై టెన్షన్ : ఎవరీ రోహిత్ ఆర్య.. ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు.. 17 మంది పిల్లల కిడ్నాప్ ఎందుకు..?
ఇతకూ ఏంటి రోహిత్ ఆర్య కంప్లైంట్. ఎందుకు ప్రభుత్వంతో పేచీ.. అంటే.. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా.. ప్రభుత్వం ఇచిన్న సచ్ఛ్ స్లోగన్స్ కు ప్రేరణ పొంది తన శాలరీ అంతా స్కూల్ డెవలప్మెంట్, పరిశుభ్రత మొదలైన కార్యక్రమాలకు ఖర్చు చేశాను. నేను చేసిన పనికి ప్రభుత్వం మెచ్చుకుంటుందని అనుకున్నా. అదే విధంగా రీయింబర్స్మెంట్ ఇస్తుందని భావించా. కానీ నన్ను పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, ఆందోళనలు చేశా. అయినా నాకు న్యాయం జరగలేదు. నేను చేసిన మంచి అంతా వృధాగా పోయింది. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నా.. అంటూ వీడియోలో తెలిపాడు.
చిన్నారులను కాపాడే క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో రోహిత్య ఆర్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఎయిర్ గన్ తో దాడి చేసేందుకు ప్రయత్నించాడని.. ఎన్ కౌంటర్లో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పేర్కొన్నారు.
