కిచెన్ కర్రీ రైస్ లో పురుగు.. రూ. 25 వేలు ఇస్తానంటూ రెస్టారెంట్ బేరం..

కిచెన్ కర్రీ రైస్ లో పురుగు.. రూ. 25 వేలు ఇస్తానంటూ రెస్టారెంట్ బేరం..

చండీఘడ్ లోని రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి  చికెన్ ఆర్డర్ చేస్తే అందులో పురుగులు బ‌య‌ట‌ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో (viral video)ను ఆ కస్టమర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.  మొదట రెస్టారెంట్ యాజమాన్యం బుకాయించినా... ఆ తరువాత కస్టమర్ ఫిర్యాదు కు ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
చండీగఢ్ లోని  ఓ రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్ కు 25 వేల రూపాయిలకు పైగా ఫైన్ చెల్లించింది.  సెప్టెంబర్ 14న రంజీత్ కౌర్ అనే వ్యక్తి మాల్ లోని రెస్టారెంట్ లో చికెన్ ఆర్డర్ ఇచ్చింది.  ఆ చికెన్ ఓ పురుగును గుర్తించి  డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమీషన్ కు ఫిర్యాదు చేశాడు.  

వివరాల్లోకి వెళ్తే...

రంజిత్ కౌర్ తన స్నేహితుడితో కలిసి రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ చిపోటిల్ చికెన్ రైస్ , చిపోటిల్ పనీర్ రైస్ ఆర్డర్ చేశారు.  వారు భోజనం  ముగించే సమయంలో తినే పదార్దంలో కదులుతున్న పురుగును గుర్తించి  ... మేనేజర్ కు ఈ విషయాన్ని తెలిపారు.   మేనేజర్ సరిగా స్పందించకపోవడంతో కౌర్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమీషన్ కు ఫిర్యాదు చేశాడు.  

ఆ తరువాత కౌర్ రెస్టారెంట్ కు లీగల్ నోటీసులు పంపారు.  ఈ నోటీసుపై స్పందించిన యాజమాన్యం ఆహారంలో పురుగులు లేవని... బిల్లును తగ్గించాలని కౌర్ కోరారని .. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తు్న్నారని చిల్లీస్ రెస్టారెంట్ తెలిపింది.  

రెస్టారెంట్ యాజమాన్యం కౌర్ ఫిర్యాదును పరిష్కరించడంలో విఫలమైనప్పుడు డైలీ డైరీ రిపోర్ట్ (DDR) దాఖలు చేసి.. పోలీసులకు ఫుటేజ్ ను చూపించింది.   దీంతో కమిషన్ ఆహారంలో పురుగులు ఉన్నట్లు ధృవీకరించింది.