సైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ

 సైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ

పహల్గాం ఉగ్రదాడితో భారత ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేశారని.. సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైన్యం చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. సైన్యానికి భారతీయుల తరఫున సెల్యూట్ చేస్తున్నాట్లు మోదీ చెప్పారు. 

భారత సైన్యం ధైర్య సాహసాలు ప్రపంచం చూసిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. పాక్  మన మీద దొడ్డి దారిన దాడి చేసిందని, కలలో కూడా ఊహించని రిప్లై ఇచ్చామని అన్నారు. మూడు రోజుల్లోనే పాక్ కు దిమ్మతిరిగేలా చేశామని, భారత్ దాడి తట్టుకోలేక పాక్ ప్రపంచం ముందు మోకరిల్లిందని అన్నారు. దీంతో మే 10 న DGMO లతో కాల్పుల విరమణకు వచ్చిందని చెప్పారు. 

ఆపరేషన్ సిందూర్ లో త్రివిధ దళాలు చూపించిన తెగువ, ధైర్యం ప్రపంచం చూసిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు. పాక్ దొడ్డిదారిన దాడి చేస్తే..మనం నేరుగా పాకిస్తాన్ గుండెలపై దాడి చేశామని జాతినుద్దేశించి మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా ఆయుధాలే వాడామని, ప్రతీకారం కోసం సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చెప్పారు. భారత్ చర్యలతో పాక్ నిరాశ, నిస్పృహలలో కూరుకుపోయింది.

దేశ ప్రజల రక్షణ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమని, ఐక్యతే భారతీయుల బలం అని అన్నారు. పాక్ ఎక్స్ట్రాలు చేస్తే తగిన జవాబు ఇస్తామని.. పాక్ తదుపరి చర్యలపై కన్నేసి ఉంచామని హెచ్చరించారు మోదీ. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని, ఉగ్రవాదులే ఆ దేశాన్ని భస్మం చేస్తారని అన్నారు. 

యుద్ధం తమ సిద్ధాంతం కాదని.. ఉగ్రవాదులను అంతం చేయడమే తమ లక్ష్యమని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు. దాడికి పర్యవసానం ఎంత దారుణంగా ఉంటో ఉగ్రవాదులకు అర్థం అయ్యింది. పాక్ అణుబాంబు బెదిరింపులను సహించమని.. పాక్ తో చర్చలు ఉగ్రవాదం, పీఓకే పైనే ఉంటుందని.. అంతకు మించి చర్చలు ఉండవని అన్నారు. పాక్ తోక జాడిస్తే ధీటుగా జవాబిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.