- ఆంక్షలు సడలించినా షాపులు తెరిచిలేదు లేదు
- ప్రకటించిన వ్యాపారులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చినా చాందినీ చౌక్ మాత్రం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌లోనే ఉంటుందని వ్యాపారులు చెప్పారు. చాందినీ చౌక్‌లో సోషల్ డిస్టెంసింగ్ పాటించేందుకు వీలు ఉండదని, అందుకే షట్‌డౌన్ కొనసాగిస్తామని చాందినీ చౌక్ సర్వ వ్యాపార్ మండల్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ చెప్పారు. ప్రజల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. “ ఢిల్లీలోనే అత్యంత రద్దీ గల మార్కెట్ చాందినీ చౌక్. స్థలం చాలా తక్కువగా ఉన్న కారణంగా సోషల్ డిస్టెంసింగ్ పాటించేందుకు వీలు కాదు. ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న కారణంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయించారు. ట్రేడర్స్, స్టాఫ్, పబ్లిక్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల ఆఖరుకు కేసులు కూడా తగ్గే అవకాశం ఉంది” అని భార్గవ చెప్పారు. లాక్‌డౌన్ 4.0లో ఢిల్లీలో ఎకనామిక్ యాక్టివిట్ స్టార్ట్ చేసేందుకు అనుమతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి లెటర్ రాశారు.
