
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈనెల 15కు విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై శుక్రవారం ( నవంబర్ 10) విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం విచారణను ఈ నెల 15 కు వాయిదా వేసింది. అయితే నేడు( నవంబర్ 10) చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ జరగాల్సి ఉండగా ఈ విచారణకు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరుకాలేదు. ఏఏజీ నేటి విచారణకు హాజరుకాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలియజేశారు. వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు. సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది. తొలుత విచారణను ఈ నెల 22కి వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది.