తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కొడాలి నాని : చంద్రబాబు

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కొడాలి నాని : చంద్రబాబు

గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.  కొడాలి నాని తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నాని తన రేంజ్ కు మించి మాట్లాడుతున్నాడంటూ సీరియస్ అయ్యారు. గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ‘ కొడాలి నాని ఎక్కడి వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు. ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే దుర్మార్గుడిని చిత్తుగా ఓడించాలి. మీ నియోజకవర్గంలో ఒక్క పనైనా చేశాడా?  ఇప్పటి వరకు కనపడని వ్యక్తి ఎన్నికల సమయంలో డబ్బుల మూటలతో ఓట్లు కొనడానికి వస్తాడు. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఇక్కడే ఉంటానని ఇల్లు కొన్నాడు. ఇప్పుడు కావాలనే కుల ప్రస్తావనలు తెస్తు ఓట్లు దండుకోవాలని ప్రతిపక్ష నేతలు చూస్తున్నారు‘ అని  విమర్శించారు.