అసెంబ్లీలో మాట్లాడే అవకాశమివ్వడం లేదు: చంద్రబాబు

అసెంబ్లీలో మాట్లాడే అవకాశమివ్వడం లేదు: చంద్రబాబు

అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని అన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వడం లేదన్నారు. 45 ఏళ్లకే  పించన్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోనందుకు ముగ్గురు టీడీఎల్పీ నేతలను సస్పెన్స్ చేశారని అన్నారు. సస్పెన్షన్ పై  మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. బీసీ నేత అచ్చెన్నాయుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లు పెట్టారని అన్నారు. రైతు భరోసా కింద రూ.12500 ఇస్తామని హామి ఇచ్చి ఇప్పుడు కేంద్రం సగం, రాష్ట్రం సగం ఇస్తామనడం మాట తప్పడం కాదా ? అని ప్రశ్నించారు చంద్రబాబు.

కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 60మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఎంత సేపైనా మైక్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చేయి ఎత్తితే నరికేస్తామంటున్నారని విమర్శించారు. ఎందుకింత అసహనం వస్తోంది. ఇదేనా ప్రజా స్వామ్య స్ఫూర్తి? ప్రశ్నించారు. అమరావతి ని భ్రష్టు పట్టించారని.. అడుగడుగునా చేతకాని తనం వల్ల రాష్ట్రాన్ని అనాధగా చేస్తున్నారని విమర్శించారు. ఇంత దారుణమైన అసెంబ్లీ ని ఎప్పుడూ చూడలేదని.. తమవైపు చూసే సాహసం కూడా స్పీకర్ చేయటం లేదని అన్నారు.