ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శబరి బ్లాక్ లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయల్ హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుల త్యాగాలను ఏనాటికి మరవొద్దన్నారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కో ఆర్డినేషన్ డా. గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.