వాలంటీర్ వ్యవస్థపై బాబు " యూ టర్న్ "... సడన్ గా ఇంత మార్పేంటి..!

వాలంటీర్ వ్యవస్థపై బాబు " యూ టర్న్ "... సడన్ గా ఇంత మార్పేంటి..!

టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై తన మనసు మార్చుకున్నాడు. జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రారంభించినప్పటి నుండి ఈ సిస్టమ్ మీద, వాలంటీర్ల మీద విమర్శలు చేస్తూ వస్తున్నాడు. డిగ్రీలు పీజీలు చేసిన నిరుద్యోగ యువతకు 5వేల రూపాయలు ఇచ్చి గోనె సంచులు మోయిస్తూ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండి పడేవాడు. అంతే కాకుండా పగటి పూట మగవారు లేని సమయంలో ఇళ్లలో దూరి వాలంటీర్లు మహిళలను ఇబ్బంది పెడుతున్నారని వాలంటీర్లను కించపరిచాడు చంద్రబాబు. వాలంటీర్లు జగన్ కు బానిసలుగా పని చేస్తున్నారని విమర్శించే వాడు.

సీన్ కట్ చేస్తే, 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబుకు వాలంటీర్ల మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చింది. సోమవారం పెనుగొండలో జరిగిన రా కడలి రా సభా వేదికపై వాలంటీర్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేయమని, మెరుగు పరుస్తామని అన్నాడు. వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి భవిష్యత్తుకి భరోసా కల్పిస్తామని అన్నాడు.

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమర్థవంతంగా పని చేస్తున్న వాలంటీర్ల ఓట్లను తన వైపుకు తిప్పుకోవాలన్న ఉద్దేశమే బాబు వైఖరిలో మార్పుకు కారణమని చెప్పచ్చు. ఒకప్పుడు పనికిమాలిన వ్యవస్థ అని అన్న నోటితోనే ఈరోజు వాలంటీర్ల ఓట్ల కోసం హామీలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు చంద్రబాబు. ఏదేమైనా తాను ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షాలు టచ్ చేయాలంటేనే భయపడే స్థితికి రావటం జగన్ విజయం అనే చెప్పాలి.