
చిత్తూరు : తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ్టినుంచి ప్రారంభిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఇవాళ ఉదయం తిరుపతిలో వెంకన్నను భార్య భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో బూత్ స్థాయి నాయకులతో సమావేశం అయ్యారు. చిత్తూరులో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత… సాయంత్రం వరకు శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ కూడా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి.. ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు.
తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరవీరుడు పొట్టి శ్రీరాములు జయంతి ఇవాళ. ఇదే సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు చంద్రబాబు. ఏప్రిల్ 11న ఏపీలో ఒకే దశలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగియనున్నాయి. బహిరంగసభలు, ర్యాలీలతో శరవేగంగా రాష్ట్రమంతా చుట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.