బిగ్ షాక్ : చంద్రబాబు ములాఖత్ లకు కోత

బిగ్ షాక్ : చంద్రబాబు ములాఖత్ లకు కోత

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు  లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ నిర్ణయం ప్రకటన సందర్భంగా తెలిపారు.  పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.

చంద్రబాబు ములాఖత్ వల్ల  ఖైదీల రాకపోకలకు  ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతుంది. ఐదు వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందంటూ ప్రభుత్వం చెపుతున్న కారణాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్ లను కూడా కుదించడం కుట్రే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read :- చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా

చంద్రబాబుకు లీగల్ మలాఖత్ ల కుదింపు ప్రభుత్వ కుట్రే అని టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఇచ్చే లీగల్ ములాఖత్ లను కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కేసుల్లో సరైన విధంగా న్యాయ పోరాటం చేయకుండా చేసేందుకు ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి లీగల్ ములాఖత్ పై ఆంక్షలు పెట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు. 39 ( వార్త రాసే రోజుకు) రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబును రోజూ రెండు సార్లు తన అడ్వకేట్లు కలుస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి రోజుకు ఒక్కసారి మాత్రమే ములాఖత్ ఉంటుందని అధికారుల తేల్చి చెప్పారు. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని....వీటిపై పోరాటం కోసం ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పారు. అయితే ప్రభుత్వం లీగల్ ములాఖత్ లను తగ్గించడం ద్వారా లీగల్ ఫైట్ లో చంద్రబాబు ముందుకు వెళ్లకుండా చూడాలన్న కుట్ర చేసిందని నేతలు ఆరోపించారు.