చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట

చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది.  చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో దక్కని ఊరట దక్కలేదు.  సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. 

చంద్రబాబుకు సెక్షన్ 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్‌ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు.  

దీంతో తదుపరి చర్యల కోసం విస్తృత ధర్మాసనానికి  బదిలీ చేయాలని సీజేఐకు నివేదిస్తున్నామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.  కాగా  స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు.  . గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.