
ఎన్టీఆర్ పేరిట వెండి రూ. వంద నాణెన్ని విడుదల చేసినందుకు ప్రధాని మోడీకి టీడీపీ జాతీయ అధక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ గొప్ప సంస్కారణవాది అని అన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవని చెప్పారు. చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు.
మార్చి 29 రాష్ట్ర రాజకీయాలను తిరగరాసిన రోజు అని వెల్లడించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, రాజమండ్రిలో మహానాడు జరుపుతామని వెల్లడించారు. ఇక తన తరువాత వచ్చిన నలుగురు సీఎంలు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని, వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయినా అభివృద్ధిలో ముందుండాలన్నదే టీడీపీ విధానమని పేర్కొన్నారు. విభజన సమయంలో సమాన న్యాయం కోసం టీడీపీ పోరాడిందన్నారు.