
స్కిల్ స్కాం కేసులో రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి... చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు.
సోమవారం బెయిల్ పిటిషన్ విచారణ: న్యాయమూర్తి
చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను సోమవారం (సెప్టెంబర్ 25) విచారిస్తామని న్యాయమూర్తి చంద్రబాబుకు తెలిపారు. విచారణ సమయంలో సీఐడీ అధికారులు ఇబ్బంది పెట్టారా అని చంద్రబాబును న్యాయమూర్తి అడిగారు. ఇంకా మొదటిరోజు 11.30 గంటలకు విచారణ మొదలైందని సీఐడీ అధికారు చెప్పారు ఇది నిజమేనా అని కూడా అడిగారు.థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా అని అడిగారు. అయితే తాను విచారణకు పూర్తిగా సహకరించానని కోర్టుకు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడే అంతా అయిపోయిందని భావించాల్సిన అవసరం లేదని జడ్జి చంద్రబాబుతో అన్నారు. మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నరంటూ .. సీఐడీ స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ కోర్టుకు సమర్పించిందని తెలిపారు.
విచారణ విషయాలు బయట పెట్టండి: చంద్రబాబు
అయితే విచారణలో ఏం గుర్తించారో బయటపెట్టాలని చంద్రబాబు కోర్టును కోరారు. అయితే విచారణ సమయంలో విషయాలు బయటపెట్టడం సరికాదని చంద్రబాబుకు తెలిపారు. విచారణ ఇంకా చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు లాయర్లపై న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లు దాఖలు చేస్తే ఎలా విచారించాలన్నారు.