స్వగ్రామం చేరుకున్న నారావారి కుటుంబం

స్వగ్రామం చేరుకున్న నారావారి కుటుంబం

సంక్రాంతి సంబరాల కోసం గురువారం రాత్రి నారావారిపల్లికి టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేరుకున్నాారు. ఆయన కుటుంబ సభ్యులకు టీడీపి  నాయకులు ఘన స్వాగతం పలికారు. ‘కాబోయే ముఖ్యమంత్రి చంద్రగిరి చంద్రన్న’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గ్రామ నాయకులను పేరుపేరునా పలకరించారు. తర్వాత నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి యువగలం గోడ పత్రికలను చంద్రబాబు ఆవిష్కరించారు.

కుటుంబ సభ్యులకు విందు...

సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీడీపి  నాయకులంతా శుక్రవారం మధ్యాహ్నం నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబసభ్యులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం నందమూరి బాలకృష్ణ శుక్రవారం నారవారిపల్లికి చేరుకోనున్నారు. తర్వాత చంద్రగిరి లేదా తిరుపతిలో వీరసింహారెడ్డి సినిమాని అభిమానులతో కలిసి చూడనున్నారు.