జైలుకు చంద్రబాబు.. టపాసులు కాల్చి స్వీట్లు పంచిన రోజా

జైలుకు చంద్రబాబు.. టపాసులు కాల్చి స్వీట్లు పంచిన రోజా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ (థర్డ్ అడిషనల్ సెషన్స్) కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు రావడంతోనే ఆయనను భారీ పోలీసు భద్రత నడుమ విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. 

చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో మంత్రి రోజా సంతోషం వ్యక్తం చేశారు. ఆమె సొంత నియోజకవర్గమైన నగరిలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా స్వీట్లు పంచారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఏపీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ సంబరాలు చేసుకుండగా.. తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహాంతో రగిలిపోతున్నారు.

ALSOREAD: జీ 20 సదస్సు డైవర్ట్ చేయడానికే చంద్రబాబు అరెస్ట్ : పవన్ కల్యాణ్ 

వైసీపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్న ఆమె తన నివాసం వద్ద టపాసులు కాల్చారు. స్వీట్లు పంచిపెట్టారు. చంద్రబాబు చేసిన తప్పులకు ఎప్పుడో అరెస్ట్ అయ్యుండాలని... భగవంతుడు ఇప్పుడు టైమ్ ఎందుకు డిసైడ్ చేశాడంటే ఇదే వయసులో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయన మీద చెప్పులు వేయించి చావుకు కారణమయ్యాడు అని ఆరోపించారు మంత్రి రోజా.