సమాజ హితాన్ని కోరేదే సాహిత్యం : మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్

సమాజ హితాన్ని కోరేదే సాహిత్యం : మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
  • డీటీసీ ఎం.చంద్రశేఖర్ గౌడ్ 

కరీంనగర్, వెలుగు : సమాజహితాన్ని కోరేదే సాహిత్యమని, సమాజంలోని అంశాలను వ్యక్తీకరించే సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.  కరీంనగర్ సిటీలోని అద్విత స్కూల్‌‌‌‌లో భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కవి మహ్మద్ ఖలీద్ రచించిన 'మనమంతా ఒక్కటే' కవితా సంపుటిని చంద్రశేఖర్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృత్తిపరంగా ఆటో డ్రైవర్ అయిన మహ్మద్ ఖలీద్ ప్రవృత్తిగా రచనా వ్యాసంగాన్ని ఎంచుకోవడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో సాహిత్య వేదిక అధ్యక్షుడు ప్రభాకర్, డాక్టర్ రామకృష్ణ, సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్, కుమారస్వామి, గజేందర్ రెడ్డి, ప్రేంసాగర్ రావు, కిషన్, రాజన్న, శంకరయ్య, శంకర్, సంపత్ కుమార్, ఎం.ఎ.బేగ్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విలాసాగరం రవీందర్ పుస్తక సమీక్ష చేశారు.