చంద్రయాన్-3.. ఇస్రో చీఫ్, శాస్త్రవేత్తలకు మెగా సత్కారం

చంద్రయాన్-3.. ఇస్రో చీఫ్, శాస్త్రవేత్తలకు మెగా సత్కారం

చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన ఒక రోజు తర్వాత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగస్టు 24న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్‌ను, బెంగళూరుకు చెందిన దాదాపు 5వందల మంది శాస్త్రవేత్తలను సత్కరించనున్నట్టు ప్రకటించారు. అంతకుముందు ఇస్రోను సందర్శించిన ఆయన.. ఇస్రో సాధించిన ఘనత ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూసేలా చేసిందని, చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగడం చారిత్రక విజయం అని అన్నారు.

విధానసౌధలోని బాంక్వెట్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇస్రో శాస్త్రవేత్తలను ప్రభుత్వం సన్మానించనుందని సిద్ధరామయ్య ఈ సందర్భంగా తెలిపారు. "ఈ సాధన కోసం శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌తో సహా కర్ణాటకకు చెందిన 5వందల మంది శాస్త్రవేత్తలు విక్రమ్ ను 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణింపజేయడం చిన్న విజయం కాదు. దేశంలోని మొత్తం వెయ్యి మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. దాదాపు 5వందల మంది బెంగుళూరుకు చెందిన వారు" అన్నారాయన.

సెప్టెంబర్ 2 తర్వాత సత్కార కార్యక్రమం తేదీని నిర్ణయిస్తామని సిద్దరామయ్య చెప్పారు. భారత్‌తో పాటు రష్యా, అమెరికా, చైనా అనే మూడు దేశాలు చంద్రుడిపై అడుగు పెట్టాయని, ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశం భారత్ అని, ఇస్రో సాధించిన విజయాన్ని మనమంతా అభినందించాలని, అన్నారు. ఇస్రో కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం, మద్దతు ఉంటుందన్న సీఎం.. ఇస్రో దేశానికే గర్వకారణమని కొనియాడారు.  అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత, చంద్రయాన్-3 ల్యాండర్, 'విక్రమ్', ఆగస్టు 23న సాయంత్రం చంద్ర దక్షిణ ధృవాన్ని తాకింది. అలా ఆ ధృవాన్ని తాకిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది.

ಇವರು ಚಂದ್ರಯಾನ-3 ಯೋಜನೆಯ ಯಶಸ್ಸಿನ ಹಿಂದಿರುವ ಶಕ್ತಿಗಳು. ವಿಕ್ರಂ ಲ್ಯಾಂಡರ್ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಚಂದ್ರದ ಮೇಲೆ ಇಳಿದ ಕ್ಷಣದಿಂದ ಇಡೀ ವಿಶ್ವವೇ ಇವರ ಸಾಧನೆಯನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಿದೆ.
ಪೀಣ್ಯದಲ್ಲಿರುವ ಇಸ್ರೋ ಕಚೇರಿಗೆ ಇಂದು ಭೇಟಿನೀಡಿ ಇಂಥದ್ದೊಂದು ಅಸಾಧಾರಣ ಸವಾಲನ್ನು ಸಾಧ್ಯವಾಗಿಸಿ ಐತಿಹಾಸಿಕ ಸಾಧನೆ ಮಾಡಿದ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ವಿಜ್ಞಾನಿ ಮಿತ್ರರ… pic.twitter.com/SLFrSP8H9T