25 సంవత్సరాల ముందే ఎలా: మళ్లీ తిరిగి భూమిపైకి వచ్చిన చంద్రయాన్ 3 రాకెట్..

25 సంవత్సరాల ముందే ఎలా: మళ్లీ తిరిగి భూమిపైకి వచ్చిన చంద్రయాన్ 3 రాకెట్..

2023 జూలై 14న చంద్రయాన్3 వ్యోమనౌక విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఎల్ వీఎం3ఎం 4 లాంచ్ వెహికల్ లోని క్రయోజనిక్ ఎగువ దశ భూవాతారణంలోకి అనియంత్రిత ఎంట్రీని ఇచ్చిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  తెలిపింది.

ఈ రాకెట్ బాడీ LVM3 M4 లాంచ్ వెహికల్ లోని భాగమని తెలిపింది. ఇది బుధవారం (నవంబర్15) తెల్లవారు జామున మళ్లీ భూమి వాతావరణంలోకి ప్రవేశించిందని ఇస్రో పేర్కొంది. ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఇంపాక్ట్ పాయింట్ అంచనా వేస్తోంది ఇస్రో.

ప్రయోగించిన 124 రోజుల్లోనే రాకెట్ బాడీ రీ ఎంట్రీ ఇచ్చింది. LVM3M4 క్రయోజెనిక్ ఎగువ దశ పోస్ట్ మిషన్ ఆర్బిటల్ జీవితకాలం,అంతర్ ఏజెన్సీ స్పేష్ డెబ్రిస్ కో ఆర్డినేషన్ కమిటీ సిఫార్సు చేసిన ప్రకారం..25 యేళ్లు భూమి కక్ష్యలో ఉండాల్సింది. నిర్ధేశిత సమయం కంటే ముందుగానే భూవాతావరణంలోకి రావడంతో గందరగోళం ఏర్పడింది. 

అయితే LVM3M4 క్రయోజెనిక్ ఎగువ దశ పోస్ట్ మిషన్ ఆర్బిటల్ జీవితకాలం 25 సంవ్సతరాల కంటే ముందుగానే భూవాతావరణంలోకి ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తున్న సమయంలో ఇస్రో క్లారిటీ ఇచ్చింది.  

చంద్రయాన్ 3 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత ఐక్యరాజ్యసమితి, IACS సూచించిన అంతరిక్ష శిథిలా ఉపశమన మార్గదర్శకాల ప్రకారం.. ప్రమాదవశాత్తు పేలుళ్ల ప్రమాదాన్ని తగ్గించేందుకు అన్ని అవశేష ప్రొపెల్లెంట్, ఇంధన వనరులను తొలగించేందుకు ఎగువ దశ కూడా పాసివేషన్ కు గురైంది. 

అంతర్జాతీయంగా ఆమోదించబడిన మార్గదర్శాలకు కట్టుబడి ఈ రాకెట్ బాడీ పాసివేషన్, పోస్ట్ మిషన్ పారవేయడం బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక సుస్థిరతను కాపాడేందుకు భారత్ మరోసారి నిబద్ధతను పునరుద్ఘాటించిందని ఇస్రో ప్రకటించింది.

Also Read :- తుఫాన్ మిధిలీ ఎక్కడ ఉంది.. ఎటు వైపు వెళుతుంది.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు ఉందా..?