చంద్రయాన్ 3 కౌంట్ డౌన్ : ఇస్రోలో ఉత్కంఠ వాతావరణం.. అందరూ ఆఫీసులోనే

చంద్రయాన్ 3 కౌంట్ డౌన్ : ఇస్రోలో ఉత్కంఠ వాతావరణం.. అందరూ ఆఫీసులోనే

చంద్రయాన్ 3 శాటిలైట్ చంద్రుడిపై దిగే చివరి ఘట్టానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇస్రో అంతా సిద్ధంగా ఉంది. ఉదయం నుంచే శ్రీహరికోట, బెంగళూరు, ఇతర ఇస్రో ఆఫీసుల్లో ఉద్యోగులు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. మా జీవితాల్లోనే అత్యంత కీలక సమయం ఇది.. చంద్రయాన్ 3 విజయవంతం చేయటమే లక్ష్యం అంటున్నారు. 

సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు చంద్రయాన్ 3 ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ అంటే చంద్రుడిపైకి దిగే ప్రక్రియ ప్రారంభించటానికి ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్ మాడ్యూల్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించే పాయింట్ దగ్గరకు రాగానే.. తమ పని ప్రారంభించనున్నారు శాస్త్రవేత్తలు.

ఇస్రోతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రయోగంపై ఉత్కంఠ ఉండటంతో.. ఇస్రోలో ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలనే ఆకాంక్షతో ఉన్నారు. ఉదయం నుంచి ఇస్రో ఆఫీసుల్లో సందడి నెలకొంది. కచ్చితంగా సేఫ్ ల్యాండింగ్ అయ్యి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన ఇస్రోకు.. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైతం సహాయ సహకారాలు అందించటానికి ముందుకు రావటం గర్వకారణం.