విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్

విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ అయిన సంగతి  తెలిసిందే.  దాదాపు 4 గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ బయటకు వచ్చింది. 6 చక్రాల రోవర్ చంద్రుడి ఉపరితలంపై సెకనుకు సెంటీమీటర్ చొప్పును మందుకు కదిలింది.  చంద్రుడిపై నాలుగు సింహాల, ఇస్రో ఉన్న చిహ్నాన్ని ముద్ర వేసింది. రోవర్ 14 రోజుల పాటు చంద్రుడిపై తిరిగి సమాచారాన్ని ల్యాండర్ కు చేరవేస్తుంది.  అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత ఇస్రో మరో కొత్త ఫోటోను విడుల చేసింది . ల్యాండింగ్ ఇమేజ్ కెమెరా  ఈ ఫోటోను తీసిందని ఇస్రో తెలిపింది.  చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ లోని కొంత భాగం ఇందులో కనిపిస్తోందని చెప్పింది.  అలాగే ల్యాండర్ లెగ్ నీడను కూడా ఇందులో చూడొచ్చని ట్వీట్ చేసింది.  చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ప్లాట్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుందని ఇస్రో వివరించింది.