చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగింది ఇక్కడే : నాసా శాటిలైట్ ఫొటోలు

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగింది ఇక్కడే : నాసా శాటిలైట్ ఫొటోలు

చంద్రుడిపై చంద్రయాన్ 3 ఎక్కడ దిగింది.. ఏ ప్రాంతంలో ఉంది.. ఎలా ఉంది.. అనే విషయాలను నాసా ప్రకటించింది. ఇదిగో ఇదే చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశం.. అదే అదే విక్రమ్ ల్యాండర్ అంటూ నాసా రిలీజ్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. 

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ఉంది. చంద్రుడికి సంబంధించిన కొన్ని వేల ఫొటోలను ఇప్పటి వరకు పంపించింది ఈ శాటిలైట్. ఈ క్రమంలోనే చంద్రుడిపై చంద్రయాన్3 విజయవంతంగా దిగిన.. నాలుగు రోజులకు అమెరికా శాటిలైట్ లూనార్.. చంద్రయాన్ 3 దిగిన ప్రదేశాన్ని ఫొటోలు తీసింది. ఈ ఫొటోలనే ఇప్పుడు నాసా రిలీజ్ చేసింది. 

Aloso Read ; భారత్​ మార్కెట్లోకి ఫేక్ మెడిసన్.. వాడితే ఖతమే అంటున్న డబ్ల్యూహెచ్ఓ

చంద్రయాన్ 3 దిగిన ప్రదేశం చుట్టూ మట్టి, ధూళి లేచినట్లు స్పష్టంగా కనిపిస్తుందని.. తెల్లటి మచ్చలా కనిపిస్తుందని.. అదే చంద్రయాన్ 3 ల్యాండర్ అని వెల్లడించింది నాసా. ఆగస్ట్ 27వ తేదీన ఈ ఫొటోలు ఎల్ఆర్ఓ శాటిలైట్ ఈ ఫొటోలు తీసి పంపినట్లు వెల్లడించింది నాసా.