చంద్రయాన్ 3 అప్ డేట్ : విక్రం ల్యాండర్ ను ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్

చంద్రయాన్ 3 అప్ డేట్ :  విక్రం ల్యాండర్ ను ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్

భారతదేశం మూన్ స్కేప్స్ లో సరిహద్దులు దాటి ప్రయాణిస్తుంది.   చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తొలిసారి చంద్రుడి ఉపరితలంపై పార్క్ చేసి ఉన్న విక్రం ల్యాండర్ ను ఫొటో తీసింది. ఆ ఫొటోను ఇస్రో బుధవారం ( ఆగస్టు 30) ట్విటర్ లో షేర్ చేసింది.

ఇస్రో లేటెస్ట్ అప్ డేట్..

చంద్రయాన్ 3 కి సంబంధించి మరో తాజా అప్డేట్ ను ఇస్రో బుధవారం ( ఆగస్టు 30) షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ నిలిచి ఉన్న విక్రం ల్యాండర్ ను వివిధ కోణాల్లో ఫోటో తీసింది.. ఆ ఫొటోల్లో విక్రం ల్యాండర్ నిలిచి ఉన్న దృశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజ్ఞాన్ రోవర్ లోని నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఆ ఫోటోలో విక్రమ్ ల్యాండర్ కు చెందిన రెండు పేలోడ్స్ ChaSTE, ILSA స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈ ఐకానిక్ స్నాప్ IST సుమారు 15 మీటర్ల నుండి తీయబడింది.  చంద్రుడి దక్షిణ ధ్రువం పై పార్క్ అయి ఉన్న విక్రమ్ ల్యాండర్ ఫోటోను ఇస్రో షేర్ చేయడం ఇదే మొదటిసారి. గత వారం ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి దిగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోలను, వీడియోను ఇస్రో షేర్ చేసింది. ఆ తరువాత చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోలను, వీడియోను షేర్ చేసింది కానీ చంద్రుడి ఉపరితలంపై నిలిచి ఉన్న విక్రం ల్యాండర్ ఫోటోను మాత్రం బుధవారం ( ఆగస్టు 30) తొలిసారిగా ఇస్రో షేర్ చేసింది.

ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం

ఆగస్టు 23వ తేదీన విక్రం లాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగింది. ఆ తర్వాత, మూడు గంటల అనంతరం లాండర్ సైడ్ ప్యానల్ లో నుంచి ర్యాంప్ ద్వారా చంద్రుడి ఉపరితలం పైకి ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టింది. ఆరు చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడు ఉపరితలంపై తిరగడం ప్రారంభించింది. గత వారం రోజులుగా విక్రం ల్యాండర్ కు సమీపంలోనే తిరుగుతూ చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని విశ్లేషిస్తుంది.