చంద్రయాన్ 3 దిగేది ఇక్కడే.. స్థలం ఫిక్స్ చేసిన ఇస్రో.. ఒకే ఒక్క అడుగు దూరంలో అద్భుతం

చంద్రయాన్ 3 దిగేది ఇక్కడే.. స్థలం ఫిక్స్ చేసిన ఇస్రో.. ఒకే ఒక్క అడుగు దూరంలో అద్భుతం

మరికొన్ని గంటల్లో అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది.. భారత్ ఇస్రో సాధ్యం చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తుంది. ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుడిపైకి చంద్రయాన్ దిగుతుందని.. ఈ టైంలో మార్పు లేదని.. అంతా సవ్యంగా సాగుతుందని.. ఆల్ ఈజ్ వెల్ అని.. మంగళవారం అంటే ఆగస్ట్ 22వ తేదీ మధ్యాహ్నం సగర్వంగా ప్రకటించింది ఇస్రో..

చంద్రుడిపై దిగే ప్లేస్ ను ఫైనల్ చేసినట్లు చెబుతోంది. చంద్రుడి ఉపరితం చాలా కఠినంగా ఉంటుందని.. పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయని.. కొన్ని ప్రాంతాల్లో మైనస్ 300 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని.. గురుత్వాకర్షణ శక్తి ఉండదని.. దీంతో శాటిలైట్ ను సురక్షితంగా దించటం ఎంతో సవాల్ తో కూడుకున్న విషయంగా అభివర్ణించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. చంద్రుడికి అడుగు దూరంలోకి వచ్చామని.. సేఫ్ ల్యాండింగ్ చేసి తీరతామనే ధీమా వ్యక్తం చేస్తుంది ఇస్రో. 

ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం ఆరు గంటలు నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల మధ్య ఉన్న సమయం చాలా విలువైనదని.. ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఈసారి ప్రయోగం చేపట్టామని వెల్లడించింది ఇస్రో.

చంద్రయాన్ 3 మిషన్ లోని ల్యాండర్ పోజిషన్ డిటెక్షన్ కెమెరా ఆగస్టు 19న తీసిన కొన్ని చిత్రాల వీడియోలను ఇస్రో విడుదల చేసింది.  ఇవి చంద్రుడికి 70 కిలో మీటర్ల ఎత్తు నుంచి తీసిన ఫోటోలను వెల్లడించింది.