చంద్రుడిపై శివ శక్తి పాయింట్‌లో తిరుగుతోన్న రోవర్.. ISRO లేటెస్ట్ వీడియో

చంద్రుడిపై శివ శక్తి పాయింట్‌లో తిరుగుతోన్న రోవర్.. ISRO లేటెస్ట్ వీడియో

చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌.. తమ పనిలో నిమగ్నమైపోయాయి. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది. 

అందుకు సంబంధించిన మరో వీడియోను ఇస్రో తాజాగా ట్వీట్ చేసింది. అందులో ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న రహస్యాలను కనుగొనే ప్రయత్నంలో 'శివశక్తి పాయింట్' చుట్టూ తిరుగుతూ కనిపించింది. కాగా, ఇస్రో పోస్ట్ చేసిన గత వీడియోలో రోవర్..  విజయవంతంగా 8 మీటర్లు ప్రయాణించినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా, శనివారం గ్రీస్ పర్యటన నుంచి బెంగళూరు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 మిషన్.. ల్యాండ్ అయిన ప్రదేశాన్ని 'శివ-శక్తి'గా, చంద్రయాన్-2 పాదముద్ర వేసిన ప్రదేశాన్ని 'తిరంగా' అని నామకరణం చేశారు.