వీడియో : చంద్రుడిపై కొండల మధ్య తిరుగుతున్న ప్రగ్యాస్ రోవర్.. ఇస్రో ముద్ర ఇలా..

వీడియో : చంద్రుడిపై కొండల మధ్య తిరుగుతున్న ప్రగ్యాస్ రోవర్.. ఇస్రో ముద్ర ఇలా..

చంద్రుడు ఎలా ఉన్నాడు.. మనకు తెలిసింది చల్లగా వెన్నెల కురిపిస్తాడని.. దక్షిణ దృవంలో ఎలా ఉన్నాడనేది ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తోంది ప్రగ్యాస్ రోవర్. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడిపైకి వచ్చిన రోవర్.. ఇప్పుడు తన పని ప్రారంభించేసింది. 12 గంటలుగా.. బుడి బుడి అడుగులు వేస్తూ.. కొండల మధ్య తన ప్రయాణాన్ని సాగిస్తుంది రోవర్. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఇస్రో ముద్ర వేసింది. 

ఆగస్ట్ 24వ తేదీ ఉదయం తొమ్మిది గంటల సమయంలో.. ల్యాండర్ నుంచి సుదూర ప్రాంతానికి వచ్చింది. ఆ సమయంలో రోవర్ తన చుట్టుపక్కల ఉన్న కొండలను ఫొటోలు, వీడియోలను ఇస్రోకు పంపించింది. ఎత్తున పర్వతాలు.. ఎంతో నునుపుగా ఉన్నాయి. ఎత్తుపల్లాలు లేకుండా చదరంగా ఉండటం విశేషం. అత్యంత సమీపంలో నుంచి చంద్రుడి కొండ విజువల్స్ ను స్పేస్ సెంటర్ రిలీజ్ చేసింది. ఈ దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. 

రోవర్ అనుకున్నదాని కంటే ఎంతో సమర్థవంతంగా పని చేస్తుంది. రోవర్ పైన సోలార్ ప్యానెల్స్ ద్వారా తన చంద్రుడిపై దృశ్యాలను ఎంతో చక్కగా పంపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియో ఓసారి మీరూ చూసేయండి.