చంద్రయాన్3 : చంద్రుడిపై ఆక్సిజన్.. ఇస్రో కీలక ప్రకటన..

చంద్రయాన్3 : చంద్రుడిపై ఆక్సిజన్.. ఇస్రో కీలక  ప్రకటన..

చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా కొనసాగుతోందని ఇస్రో ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక విషయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై  సల్ఫర్ నిక్షేపాలున్నట్లుప్రజ్ఞాన్ రోవర్ కొనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. 

రోవర్ లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రో స్కోప్(LIBS) పరికరం చంద్రుని దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉనికిని మొదటిసారి ఇన్ సిటు కొలతల ద్వారా గుర్తించిందని పేర్కొంది. సల్పర్ తోపాటు ఆక్సిజన్ కూడా ఉన్నట్లు గుర్తించింది.  

వీటితో పాటు అల్యూమినియం (Al), కాల్షియం(Ca), ఐరన్(Fe), క్రోమియం(Cr), టైటానియం (Ti), మాంగనీస్(Mn), సిలికాన్(Si) కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే మరోవైపు హైడ్రోజన్ కోసం అన్వేషిస్తున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. LIBS పరికరం బెంగుళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ (LEOS)/ISRO కోసం ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడింది.