సేఫ్ ల్యాండింగ్ కోసం 'భస్మ హారతి'

సేఫ్ ల్యాండింగ్ కోసం 'భస్మ హారతి'

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్‌ సురక్షితంగా, విజయవంతంగా ల్యాండ్ అవ్వాలని దేశమంతా కోరుకుంటోంది. ఈ క్రమంలో పలు చోట్ల పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక 'భస్మ ఆరతి' నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ అందుబాటులో ఉంది. ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ఆగస్టు 23 (బుధవారం) సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో సాఫ్ట్-ల్యాండింగ్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది. దీంతో అందరి దృష్టి చంద్రయాన్-3 పై పడింది.

వర్చువల్‌గా వీక్షించనున్న ప్రధాని మోదీ

చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు.