చంద్రుడిపై గుంతలు తవ్వుతున్న రోవర్.. నీళ్ల అన్వేషణలో చంద్రయాన్ 3

 చంద్రుడిపై గుంతలు తవ్వుతున్న రోవర్.. నీళ్ల అన్వేషణలో చంద్రయాన్ 3

చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేస్తుంది.. ఎలాంటి పరిశోధనలు చేస్తుంది అనే ఆసక్తి అందరిలో ఉంది. రోజు రోజుకు కొత్త అప్ డేట్ తో ఇస్రో చందమామ రహస్యాలను వెల్లడిస్తుంది. ఈక్రమంలోనే చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న రోవర్.. ఇప్పుడు చంద్రుడిపై గుంతలు తవ్వుతుంది.. పెద్ద పెద్దవి కాకపోయినా.. పది మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ వేస్తుంది రోవర్. చంద్రుడి ఉపరితలం కింద ఏమున్నది.. మట్టి ఉందా.. నీళ్లు ఉన్నాయా.. రాళ్లు ఉన్నాయా.. మెత్తగా ఉందా.. గట్టిగా ఉందా.. బురద ఉందా.. ఉంటే ఎలా ఉంది.. ఏముందీ అనేది డ్రిల్లింగ్ ద్వారా పరిశోధనలు చేస్తుంది రోవర్.

చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్  కష్టపడి పని చేస్తోంది. చంద్రుడిపై రోవర్  పలు  ప్రయోగాలు నిర్వహించడంతోపాటు విలువైన డేటాను ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరవేస్తోంది.  ఇందులో భాగంగా చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలను చంద్రయాన్-3 కొలిచినట్టు ఇస్రో  వెల్లడించింది. ఉపరితలంపై ఉష్ణోగ్రతల తీరు, వాటి నమోదుకు విక్రమ్ ల్యాండర్‌లో చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ పేలోడ్‌ను ఇస్రో అమర్చింది. ఈ చాస్టె పేలోడ్.. దక్షిణ ధ్రువంపై ఉపరితల ఉష్ణోగ్రతలను కొలిచినట్లు ఇస్రో  ప్రకటించింది.  దీనికి సంబంధించిన గ్రాఫ్‌ను ఇస్రో పంచుకుంది. 

చంద్రుని దక్షిణ ధ్రువానికి సంబంధించి  రోవర్ డేటా ప్రకారం..అక్కడ ఉష్ణోగ్రత -10 ° సెల్సియస్ నుంచి 60 ° సెల్సియస్ పరిధిలో ఉంటుంది. అలాగే చంద్రుని ఉపరితలంపై వివిధ లోతులలో ఉష్ణోగ్రత వైవిధ్యాలను కూడా రోవర్ వివరిస్తుంది.  అంతేకాదు చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ పేలోడ్‌ చంద్రుడి ఉపరితలం కింద 10 సెంటీ మీటర్ల లోతును చేరుకోగల నియంత్రిత వ్యాప్తి మెకానిజం కలిగి ఉంది.  ఇందులో 10 వ్యక్తిగత ఉష్ణోగ్రత సెన్సార్లను అమర్చారు. దీని ద్వారా 10 మీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి...చంద్రుడిపై  ఎలాంటి నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ ఉన్న మట్టి , నీటి సౌకర్యం వంటి ప్రయోగాలు చేస్తోంది.