నిద్రలోకి జారుకున్న ప్రజ్ఞాన్ రోవర్..పగలు మొదలయ్యాక మళ్లీ పని..​

నిద్రలోకి జారుకున్న  ప్రజ్ఞాన్ రోవర్..పగలు మొదలయ్యాక మళ్లీ పని..​

చంద్రుడిపై 100 మీటర్ల జర్నీ పూర్తి చేసుకున్న ప్రజ్ఞాన్​ రోవర్​ స్లీప్​ మోడ్​లోకి వెళ్లింది. రోవర్​లోని పేలోడ్లను ఆఫ్​ చేసి, రిసీవర్​ను మాత్రమే ఆన్​ చేసి ఉంచామని ఇస్రో తెలిపింది. ఈ నెల 22న పగలు ప్రారంభమయ్యాక మళ్లీ పని చేస్తుందని వెల్లడించింది.

చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల జర్నీ పూర్తి చేసుకుంది. జాబిల్లిపై శివశక్తి పాయింట్ వద్ద ఉన్న ల్యాండర్ నుంచి అది గరిష్టంగా 500 మీటర్ల దూరం వెళ్లగలదు. అయితే, చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభమై 14 రోజులు కొనసాగనుండటంతో రోవర్ ను శనివారం సేఫ్ గా పార్క్ చేసి, స్లీప్ మోడ్ లోకి పంపినట్లు ఇస్రో ప్రకటించింది. రోవర్ లోని పేలోడ్లను ఆఫ్ చేసి, రిసీవర్ ను మాత్రం ఆన్ చేసి ఉంచామని తెలిపింది. మళ్లీ ఈ నెల 22న అక్కడ పగలు ప్రారంభమవుతుందని, అప్పుడు రోవర్ తిరిగి పని చేస్తుందని ఆశిస్తున్నట్లు ఇస్రో ట్వీట్ లో పేర్కొంది.