దేశ భవిష్యత్తు మార్చండి: యువ ఓటర్లకు మోడీ పిలుపు

దేశ భవిష్యత్తు మార్చండి: యువ ఓటర్లకు మోడీ పిలుపు

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత తప్పక ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ‘ఈ రోజు లోక్‌సభ ఎన్నికల తుదిదశ పోలింగ్. ఈ ఎన్నికల్లో అందరూ తమ ఓటుహక్కు వినియోగించుకుని రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదుచేయాలి. మీ ఓటు భవిష్యత్ భారతావని తలరాతను మార్చేయాలి. తొలిసారి ఓటేసే వాళ్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారనుకుంటున్నా’నని మోడీ ట్వీట్ చేశారు.