
నర్సంపేట, వెలుగు: వ్యవసాయ మార్కెట్కమిటీల చైర్మన్లు నిత్యం అందుబాటులో ఉండి రైతులకు అండగా నిలవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల కమిటీ సమావేశం ఆదివారం నర్సంపేట మార్కెట్లో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త కమిటీ కార్యవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.
ఉమ్మడి వరంగల్జిల్లా చైర్మన్‌గా చందుపట్ల రాజిరెడ్డి..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల కమిటీ జిల్లా చైర్మన్‌గా పరకాల మార్కెట్ చైర్మన్చందుపట్ల రాజిరెడ్డి ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా కేసముద్రం మార్కెట్‌చైర్మన్ గంటా సంజీవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనగామ మార్కెట్చైర్మన్బసుక శివరాజ్‌యాదవ్, ఉపాధ్యక్షులుగా మహబూబాబాద్మార్కెట్చైర్మన్సుధాకర్నాయక్, నెక్కొండ మార్కెట్చైర్మన్రావుల హరీశ్‌రెడ్డి, కార్యదర్శిగా కొడకండ్ల మార్కెట్ చైర్మన్నల్ల అండాలు శ్రీరామ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకటాచారి, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలకంటి లావణ్యాశిరీశ్రెడ్డి, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు..
నెక్కొండ: వరంగల్జిల్లా నెక్కొండ వ్యవసాయమార్కెట్‌కమిటీ చైర్మన్రావుల హరీశ్‌రెడ్డికి జిల్లా కమిటీలో చోటు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు పదవి రావడానికి కృషిచేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.