ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు

న్యూఢిల్లీ: రిస్క్​ తీసుకోలేని వాళ్లు ఎక్కువగా ఇష్టపడే పెట్టుబడి మార్గం ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లు (ఎఫ్​డీ). వీటిని టైమ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. పెట్టుబడిదారులు తమకు నచ్చినన్ని ఏళ్లు డబ్బును పొదుపు చేసేందుకు వీలుంటుంది. ఎంచుకున్న కాలవ్యవధిలో లేదా మెచ్యూరిటీ సమయంలో స్థిరమైన వడ్డీ చెల్లింపులను పొందవచ్చు. వివిధ బ్యాంకులు 3 నుంచి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇవి పెట్టుబడి వ్యవధిపై ఆధారపడి ఉంటాయి. 

సీనియర్ సిటిజన్లు అదనంగా 0.5 శాతం వడ్డీ పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి ముందు, వివిధ బ్యాంకులు అందించే ఫిక్స్‌‌డ్ డిపాజిట్ (ఎఫ్​డీ) రేట్లను సరిపోల్చడం తప్పనిసరి. కాబట్టి నాలుగు ముఖ్యమైన బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీరేట్ల గురించి తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా   

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్​బీఐ) ఫిక్స్​డ్​ డిపాజిట్లలో (ఎఫ్​డీలు) పెట్టుబడి పెట్టే కస్టమర్లకు, వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్​) లేదా 0.5 శాతం వడ్డీ పొందుతారు. ప్రత్యేకించి, ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఎఫ్​డీలకు ఈ బ్యాంక్ 6.80 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాకుండా, రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 7 శాతం రేటును అందిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 

పీఎన్​బీ గత అక్టోబర్ 10 నాటి నుంచి ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు అందిస్తోంది.  ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్ల కోసం సాధారణ పెట్టుబడిదారులకు వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌లు మాత్రం 7.25 శాతం అధిక రేటును పొందుతారు.

ఐసీఐసీఐ బ్యాంక్  

ఐసీఐసీఐ బ్యాంక్ ఏప్రిల్ 18, 2024 నాటి నుంచి రూ. 5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్స్​ అదనంగా 0.5 శాతం వడ్డీని పొందుతారు. వారం నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ టెన్యూర్లకు ఎఫ్​డీలకు రేట్లు 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటాయి.  ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లకు సాధారణ కస్టమర్లు 6.70 శాతం వడ్డీ పొందవచ్చు.

హెచ్‌డీఎఫ్​సీ బ్యాంక్

రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఏడాది కాలవ్యవధి గల ఎఫ్​డీలపై హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. సాధారణ పెట్టుబడిదారులు 6.60 శాతం రేటును పొందవచ్చు. అయితే సీనియర్ సిటిజన్లు ఇటువంటి డిపాజిట్లపై 7.10శాతం వడ్డీని తీసుకోవచ్చు.  హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది మెచ్యూరిటీ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది.