బండి  ఓనర్షిప్ మార్పు ఇక ఈజీ

బండి  ఓనర్షిప్ మార్పు ఇక ఈజీ
  • రూల్స్‌‌‌‌‌‌‌‌ను మార్చిన కేంద్రం

న్యూఢిల్లీ: ఇప్పుడున్న రూల్స్ ప్రకారం వెహికల్ ఓనర్ మరణిస్తే, దాని ఓనర్షిప్‌‌‌‌‌‌‌‌ను ఇతరుల పేరిట బదిలీ చేయడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పేపర్ వర్క్ కూడా ఎక్కువే! ఇక నుంచి ఇలాంటి పరిస్థితి ఉండదు. వెహికల్‌‌‌‌‌‌‌‌కు  రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడే నామినీ పేరు చేర్చవచ్చు. ఇందుకోసం ‘సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్, 1989’ లో మార్పులను చేసినట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫలితంగా ఇక నుంచి వెహికల్ ఓనర్ మరణిస్తే  రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌కు నామిని పేరిట మార్చడం సులువు అవుతుంది.   అంతేకాదు ప్రస్తుత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌లో నామినీ పేరు లేకుంటే, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ అప్లికేషన్ ద్వారా కూడా చేర్చవచ్చు. అయితే ఈ విధానం దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండదు. నోటిఫైడ్ రూల్స్ ప్రకారం, ఒక వెహికల్  ఓనర్ నామినీని తానేనని రుజువు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను అందజేయాలి.  "వెహికల్  ఓనర్ మరణిస్తే, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌లో అతడు/ఆమె నామినేట్ చేసిన వ్యక్తికి దానిని తీసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా ఓనర్షిప్ బదిలీ అవుతుంది. ఇందుకోసం నామినీ ఓనర్ మరణం గురించి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు తెలియజేయాలి.  వెహికిల్ ఓనర్ మరణించినప్పటి నుండి మూడు నెలలలోపు ఓనర్షిప్‌‌‌‌‌‌‌ను బదిలీ చేయడానికి  ఫారం 31  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విడాకులు లేదా ఆస్తి గొడవల వంటి వల్ల నామినీ పేరును మార్చడానికి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చాం”అని కేంద్ర  రోడ్డు రవాణా  రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది  వెహికల్  రిజిస్టర్డ్ ఓనర్ మరణించిన సందర్భంలో వెహికిల్‌‌‌‌‌‌‌‌ను నామినీకి బదిలీ చేయడానికి రూల్స్ మార్చాలంటూ కేంద్ర రోడ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అండ్ హైవేల మంత్రిత్వశాఖ గత నవంబరులో ప్రపోజల్స్ పంపింది.  ఈ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌పై  సంబంధిత వర్గాల నుంచి, జనం నుంచి సలహాలను సూచనలను కోరింది.