Rohit Sharma: కోహ్లీకి ఉన్న పాపులారిటీతో రోహిత్కు గుర్తింపు రాలేదు: చాపెల్

Rohit Sharma: కోహ్లీకి ఉన్న పాపులారిటీతో రోహిత్కు గుర్తింపు రాలేదు: చాపెల్

ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్  రోహిత్ టెస్టు కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాగ్ పూర్ టెస్ట్ లో రోహిత్ బ్యాటింగ్ ప్రదర్శనపై చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డ పిచ్ పై రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. టెస్టు క్రికేట్ లో ఓపెనర్ గా రావడం రోహిత్ కెరీర్ ని కాపాడిందని, కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసి తన నైపుణ్యాని వృధా చేసుకున్నాడని అన్నాడు. 

‘రోహిత్ ఓపెనర్ గా వచ్చినప్పటినుంచి బాగా ఆడాడు. కానీ, అప్పుడు కోహ్లీ కెప్టెన్ గా ఉండటంవల్ల రోహిత్ శర్మకు తగిన గుర్తింపు దక్కలేదు. కోహ్లీ తర్వాత రోహిత్ తిరిగి పుంజుకోవడానికి కెప్టెన్సీ ప్రధాన పాత్ర పోషించింది. టీంను ముందుండి నడిపించడానికి అవసరమైన క్రమశిక్షణ రోహిత్ ఆటను మరో స్ధాయికి తీసుకెళ్లింది. మొదటి టెస్టు మ్యాచులో పిచ్ ను అర్ధం చేసుకుని రోహిత్ అద్భతమైన ఇన్సింగ్స్ ఆడాడ’ని చాపెల్ చెప్పాడు.