ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ 10 వేలకు పెరగనుంది

ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ 10 వేలకు పెరగనుంది

మెరుగైన భద్రత, యూజర్ ఎక్స్ పీరియన్స్ కోసం కొత్త ఫీచర్లను తీసుకొచ్చే దిశగా ట్విట్టర్ కృషి చేస్తోంది. అందుకు సంబంధించిన అప్‌గ్రేడ్‌ను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ట్వీట్ల విషయంలో క్యారెక్టర్ లిమిట్ ను తీసుకొచ్చింది. ఇదివరకు ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ 280 వరకే ఉండేది. తర్వాత దాన్ని మార్చుతూ 4000 లకు పెంచారు. అయితే, ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఆ కౌంట్ ను 10,000ల కు పెంచనున్నట్లు తెలుస్తో్ంది.

@ThePrimeagen, ఒక యూట్యూబర్ కోడింగ్‌కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి, మస్క్‌ను ‘మీరు ట్వీట్‌లకు కోడ్ బ్లాక్‌లను జోడించగలరా’ అని అడిగింది. దానికి ఎలన్ మస్క్ ‘అటాచ్ మెంట్ లు కావాలా? ఎన్ని అక్షరాల లిమిట్ ఉండాలి? ప్రస్తుతం ట్విట్టర్ లో లాంగ్ ఫార్మ్ ట్వీట్ ల కౌంట్ ను 10వేలకు పెంచబోతున్నాం’ అంటూ బదులిచ్చాడు.