
సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డి అడిషనల్కలెక్టర్(లోకల్‌బాడీస్) గా బి. చంద్రశేఖర్, అడిషన్ కలెక్టర్ (రెవెన్యూ) గా ఆర్డీ మాధురి బుధవారం కలెక్టరేట్ లోని తమ చాంబర్లలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ ఓ నగేశ్, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) గా కొనసాగిన బి. చంద్రశేఖర్ ను సంగారెడ్డి జిల్లా అడిషనల్కలెక్టర్ (లోకల్ బాడీస్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) గా కొనసాగిన జి . వీరారెడ్డిని సీసీఎల్ఏ కార్యాలయానికి బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో జగిత్యాల ఆర్డీఓ గా పనిచేస్తున్న ఆర్ డీ మాధురిని నియమించింది. సంగారెడ్డి డీఎస్పీగా రమేశ్‌కుమార్ సైతం బుధవారం
బాధ్యతలు స్వీకరించారు.
మెదక్ అడిషనల్కలెక్టర్బదిలీ
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) రమేశ్ హైదరాబాద్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు వెయిటింగ్లో ఉన్న వెంకటేశ్వర్లును మెదక్ అడిషనల్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మెదక్ జిల్లా రెవెన్యూ అధికారిణి (డీఆర్వో)గా పద్మశ్రీ నియమితులయ్యారు.
సిద్దిపేట ఏసీపీగా సురేందర్ రెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట ఏసీపీగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీపీ ఎన్. శ్వేత ను కలిసి మొక్కను అందజేశారు. కాగా సురేందర్ రెడ్డి 1998 లో ఎస్సైగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశించి ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేశారు. 2010లో సీఐ గా ప్రమోషన్ పొంది ఉమ్మడి మెదక్ జిల్లా, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలో పనిచేశారు.