చార్జీల పెంపు.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు కాంగ్రెస్ భారీ నిరసనలు

చార్జీల పెంపు.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు కాంగ్రెస్ భారీ నిరసనలు

హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్యాస్, పెట్రోల్, విద్యుత్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ద్రవ్యోల్బణం ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా నిరసనలు, బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. డిష్టి బొమ్మల దగ్దం అనంతరం కలెక్టర్ల ఆఫీసులను ముట్టడిస్తామన్నారు. కరోనాతో కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారని.. ఇటువంటి క్లిష్ట సమయంలో ధరలు పెంచడంతో ప్రజలను మరింత కష్టపెడుతున్నారన్నారు. ఏప్రిల్ -1 నుంచి విద్యుత్ చార్జీలు పెంచడంతో రూ. 5 వేల 596 కోట్లు పేదల నుంచి గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. సర్ చార్జీల పేరుతో ఇంకో 6 వేల కోట్లు లాక్కుంటుదన్న రేవంత్.. ప్రజలపై భారీగా బారం మోపుతుందన్నారు. దళిత కాలనీలకు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన సర్కార్.. ఇప్పుడు ఫ్రీ కరెంట్ కాదు కదా.. పెంచుకుంటూ పోతుందని తెలిపారు.

GDPకి కొత్త నిర్వచనం

దేశ జీడీపీ పెరిగిందని గొప్పలు చెప్పే కేంద్రం.. జీడీపీకి రేవంత్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. G-గ్యాస్, D-డీజిల్, P- పెంట్రోల్ అన్నారు. ఈ మూడింటి ధరలు పెరగడమేనా జీడీపీ అని ప్రశ్నించారు. ఈ దోపిడిని అరికట్టేందుకే ఏఐసీసీ ఆదేశాలతో 31న నిరసన కార్యక్రమాలు చేపడుతామని.. ఉగాది రోజున గ్యాప్ ఇచ్చి,  ఏప్రిల్ 7 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్, మోడీ దోపిడీలను నిలదీయాలన్నారు. సిలిండర్లకు దండలేసి, డప్పులు కొడుతూ, బైక్ ర్యాలీ, కేసీఆర్ , మోడీ దిష్టి బొమ్మల దగ్దం లాంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మొత్తం కాంగ్రెస్ లీడర్లు పాల్గొంటారన్నారు. ఇందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

ఇవి కూడా చదవండి..

ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్