
టికెట్తీసుకోని ప్రయాణికుడు
టిమ్ డ్రైవర్‌కు చార్జీ మెమో
హుజూరాబాద్, వెలుగు: ‘ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రయాణికుడిపైనే ఉంటుంది. టికెట్తీసుకోకుండా ప్రయాణికులు దొరికితే ఇకపై కండక్టర్లపై చర్యలు తీసుకోం’ అంటూ సీఎం కేసీఆర్ డిసెంబర్1న ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు. కానీ సీఎం మాటలు అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. హుజూరాబాద్ టు జమ్మికుంటకు టీమ్కండక్టర్ కమ్ డ్రైవర్‌గా తోకల సమ్మిరెడ్డి బుధవారం డ్యూటీలో ఉన్నారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు ప్రయాణికులతో వెళ్తుండగా మధ్యలో ఆర్టీసీ అధికారులు తనిఖీ చేశారు. ఒకరు టికెట్లేకుండా దొరకడంతో తోకల సమ్మిరెడ్డికి ఆర్టీసీ తనిఖీ అధికారులు చార్జి మెమో జారీ చేశారు. ఈ సంఘటనపై డిపో మేనేజర్రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కేసీఆర్సమావేశంలో చెప్పినప్పటికీ అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు అందలేదని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు.