
దేశ ద్రోహం, అల్లర్ల సంబంధిత సెక్షన్లు
న్యూఢిల్లీ: దేశ ద్రోహ ప్రసంగాలు చేయడంతోపాటు అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణలతో షర్జీల్ ఇమామ్ పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. గత డిసెంబర్ 13న జామియా ఇస్లామియాలో కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా షర్జీల్ ఇమామ్ ప్రసంగించాడు. రెండ్రోజుల తర్వాత జామియా స్టూడెంట్స్ కవాతు నిర్వహిస్తూ పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. ఐపీసీ సెక్షన్లు 124 ఏ, 153 ఏ కింద ఇమామ్‌పై చార్జిషీట్ ఫైల్ చేశామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సాకేత్ కోర్టులో అనుబంధ చార్జిషీట్ నూ దాఖలు చేస్తామన్నారు. షాహీన్ బాగ్ నిరసనల సమయంలో బిహార్ లోని జెహ్నాబాద్ లో అరెస్టవడంతో షర్జీల్ ఇమామ్ లైమ్ లైట్ లోకి వచ్చాడు.