
చాట్ జీపీటీ టెక్నాలజీ పరిశ్రమలో కొత్త మార్పును తీసుకొచ్చింది. చాట్ జీపీటీ ద్వారా కోడింగ్ రాయడం, హోం వర్కలు చేయడం, ఎస్సేలు ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. పిల్లల నాలెడ్జ్ ను దెబ్బ తీస్తుందని, ఉద్యోగుల్లో క్రియేటివిటీని, సొంతంగా పని చేయాలనే ఆలోచనను తగ్గిస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇదే కాకుండా చాట్ జీపీటీ తరహా సేవల్ని అందించడానికి కొన్ని టెక్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అయితే.. పిల్లలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యాపిల్ కంపెనీ ఐఫోన్స్ లో చాట్ జీపీటీని బ్యాన్ చేసింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ఇచ్చిన నివేదిక ప్రకారం చాట్ జీపీటీ, చాట్ జీపీటీ తరహా చాట్ బాట్ ఏఐ సేవల్ని అందించడాన్ని యాపిల్ నిషేదించింది. తమ మొబైల్స్ యాప్స్ లో గాని ఇతర యాప్స్ తో గాని చాట్ జీపీటీని వాడటానికి నిలిపివేసింది. భవిష్యత్తు తరాలపై ఏఐ వల్ల చెడు ప్రభావం ఉండకూడదని యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.